లక్సెంబర్గ్ ప్రధానితో భారత ప్రధాని సమావేశం
నవంబర్ 19న వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలపేతం, ఆర్థికం, వాణిజ్యం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఆర్థిక రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలుగా ఇరు దేశాలు మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలను విస్తరించుకునే అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించాయి. రెండు దశాబ్దాల విరామం తర్వాత భారత్-లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సదస్సు జరిగింది.
లక్సెంబర్గ్ రాజధాని: లక్సెంబర్గ్ సిటీ
కరెన్సీ: యూరో
సందర్భం: ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్-లక్సెంబర్గ్ ద్వైపాక్షిక సదస్సు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బెట్టెల్
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలపేతం, ఆర్థికం, వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు