లక్సెంబర్గ్ లో ఉచిత రవాణా విధానం
Sakshi Education
ఐరోపా దేశమైన లక్సెంబర్గ్‌లో ఉచిత రవాణా విధానంను ప్రవేశపెట్టారు. 2020, ఫిబ్రవరి 29 నుంచి లక్సెంబర్గ్ లో ఉచిత ప్రజా రవాణా అమల్లోకి వచ్చింది.
దీంతో ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా లక్సెంబర్గ్ నిలిచింది. వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు 2018, డిసెంబర్ 6న లక్సెంబర్గ్ ప్రభుత్వం ఉచిత రవాణా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తాజాగా అమల్లోకి వచ్చింది. 2013లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉచిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజా రవాణా ఉచితం చేయడం వల్ల ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమల్లోకి ఉచిత ప్రజా రవాణా విధానం
ఎప్పుడు : 2020, ఫిబ్రవరి 29
ఎవరు : లక్సెంబర్గ్ ప్రభుత్వం
ఎక్కడ : లక్సెంబర్గ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమల్లోకి ఉచిత ప్రజా రవాణా విధానం
ఎప్పుడు : 2020, ఫిబ్రవరి 29
ఎవరు : లక్సెంబర్గ్ ప్రభుత్వం
ఎక్కడ : లక్సెంబర్గ్
ఎందుకు : వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు
Published date : 03 Mar 2020 06:06PM