Skip to main content

లక్నోలో 11వ డిఫెక్స్‌పో ప్రారంభం

రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ‘11వ డిఫెక్స్‌పో’ ప్రారంభమైంది.
Current Affairsఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు.

భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
11వ డిఫెక్స్‌పోప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
Published date : 06 Feb 2020 05:58PM

Photo Stories