లియోనెల్ మెస్సీకి గోల్డెన్ బాల్ పురస్కారం
Sakshi Education
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీని ‘బ్యాలన్ డి ఓర్’ (గోల్డెన్ బాల్) అవార్డు-2019 వరించింది.
ప్రతి యేటా ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఫిఫా అందించే ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మెస్సీ ఆరోసారి గెల్చుకోవడం ద్వారాకొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది వరకు ఐదుసార్లు చొప్పున క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), మెస్సీ ఈ అవార్డు సాధించి సమఉజ్జీగా నిలిచారు. తాజా పురస్కారంతో రొనాల్డోను వెనక్కి నెట్టి మెస్సీ అత్యధికసార్లు ఈ అవార్డు గెల్చుకున్న ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మెస్సీ 2009, 2010, 2011, 2012, 2015లలో ఈ అవార్డు గెల్చుకున్నాడు. 2019 సీజన్‌లో మెస్సీ 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్ సాధించాడు.
మహిళల విభాగంలో రాపినోయ్
మహిళల విభాగంలో అమెరికాకు చెందిన మెగాన్ రాపినోయ్ ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును గెల్చుకుంది. 2019 ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌ను అమెరికా గెలవడంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ సాధించే వారికి ఇచ్చే ‘గోల్డెన్ బూట్’ అవార్డును, ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును మెగాన్ గెల్చుకోవడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘బ్యాలన్ డి ఓర్’ (గోల్డెన్ బాల్) అవార్డు-2019 విజేతలు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : లియోనెల్ మెస్సీ(పురుషుల విభాగం) మెగాన్ రాపినోయ్(మహిళల విభాగం)

Published date : 04 Dec 2019 05:37PM