లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
Sakshi Education
భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆగస్టు 11న తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.
సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని హోం మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని అమిత్ షా ప్రస్తావిస్తూ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రముఖ నటుడు రజనీకాంత్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
Published date : 12 Aug 2019 05:42PM