లిబియాలో వైమానిక దాడి
Sakshi Education
లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక శిక్షణ కేంద్రంపై జనవరి 4న వైమానిక దాడి జరిగింది.
ఈ దాడిలో సుమారు 30 మంది మృతి చెందగా మరో 33 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని లిబియా అధికారులు వెల్లడించారు. లిబియన్ నేషనల్ ఆర్మీ(ఎల్‌ఎన్‌ఏ) చీఫ్‌గా ప్రకటించుకున్న జనరల్ ఖలీఫా హిఫ్తర్, ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంపై దాడులు ఉధృతం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిబియా సైనిక శిక్షణ కేంద్రంపై వైమానిక దాడి
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : ట్రిపోలీ, లిబియా
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : లిబియా సైనిక శిక్షణ కేంద్రంపై వైమానిక దాడి
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : ట్రిపోలీ, లిబియా
మాదిరి ప్రశ్నలు
1. క్రింది వాటిలో లిబియా రాజధాని నగరం, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. ట్రిపోలి, లిబియన్ డాలర్
2. బాగ్దాద్, ఇరాకీ దినార్
3. ట్రిపోలి, లిబియన్ దినార్
4. డబ్లిన్, యూరో
- View Answer
- సమాధానం : 3
2. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో నిర్వహించిన 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సు ఇతివృత్తం ఏమిటి?
1. సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి
2. సృజనాత్మక భవిష్యత్తు కోసం సాంకేతిక అభివృద్ధి
3. భవిష్యత్తు కోసం పర్యవరణ పరిరక్షణ
4. భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ నిర్మూలన
- View Answer
- సమాధానం : 1
Published date : 06 Jan 2020 06:01PM