లిబియాలో సాయుధ ఘర్షణ
Sakshi Education
అంతర్యుద్ధంతో అతలాకుతలమైన లిబియాలో సాయుధ ఘర్షణ చెలరేగింది.
లిబియా కమాండర్ ఖలీఫా హఫ్తార్‌కు చెందిన తిరుగుబాటు దళాలు రాజధాని ట్రిపోలివైపు బయలుదేరాయి. అంతర్జాతీయ సమాజం గుర్తింపుపొందిన జీఎన్‌ఏ ప్రభుత్వ దళాలు వారిని రాజధానికి 50 కి.మీ దూరంలో నిలువరించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. 2011లో లిబియా పాలకుడు గడాఫీని అమెరికా హతమార్చడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది.
Published date : 08 Apr 2019 05:01PM