లేజర్ సాయంతో అంతరిక్ష వ్యర్థాల గుర్తింపు
Sakshi Education
అంతరిక్షంలో భూకక్ష్య పరిధిలో ఉన్న వ్యర్థ పదార్థాలను కచ్చితత్వంతో గుర్తించేందుకు చైనా శాస్త్రవేత్తలు నూతన సాంకేతికతను రూపొందించారు.
లేజర్‌తో రూపొందించిన ఈ విధానం ఇకపై వాహక నౌకలు సులువుగా, ఎలాంటి అడ్డంకులూ లేకుండా అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ‘స్పేస్ జంక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్’అనే ఈ సాంకేతికతతో అంతరిక్షంలోని చాలా చిన్న పరిమాణంలో ఉన్న వ్యర్థాలనూ చాలా వేగంగా గుర్తించవచ్చని చైనా పరిశోధకులు వెల్లడించారు. ఈ లేజర్ సాంకేతికతను బీజింగ్‌లోని ఫాంగ్‌షెన్ లేజర్ రేంజ్ టెలిస్కోప్ స్టేషన్ నుంచి పరీక్షించగా, విజయవంతమైందని తెలిపారు. ప్రత్యేక అల్గారిథమ్స్, న్యూరల్ నెట్‌వర్క్స్ అప్లికేషన్స్ ఉపయోగించిన లేజర్ రేంజింగ్ టెలిస్కోప్‌లతో అంతరిక్ష వ్యర్థాలను గుర్తించే రేటు పెరిగిందని చెబుతున్నారు. ఈ పరిశోధన వివరాలు ‘లేజర్ అప్లికేషన్స్’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేజర్ సాంకేతికతతో అంతరిక్ష వ్యర్థాల గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : చైనా శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఫాంగ్‌షెన్ లేజర్ రేంజ్ టెలిస్కోప్ స్టేషన్, బీజింగ్, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేజర్ సాంకేతికతతో అంతరిక్ష వ్యర్థాల గుర్తింపు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : చైనా శాస్త్రవేత్తలు
ఎక్కడ : ఫాంగ్‌షెన్ లేజర్ రేంజ్ టెలిస్కోప్ స్టేషన్, బీజింగ్, చైనా
Published date : 27 Dec 2019 05:26PM