Skip to main content

లద్దాఖ్ ప్రాంతంలో భూకంపాల ముప్పు అధికం

భూగర్భంలో ఇండియా, ఆసియన్ ఫలకాలు కలిసే చోట, లద్దాఖ్ ప్రాంతంలో ఫాల్ట్‌లైన్ క్రియాశీలకంగా ఉందని కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలోని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ పరిశోధనలో వెల్లడైంది.
Current Affairs
దీనివల్ల లద్దాఖ్ ప్రాంతంలో భూకంపాల సంభవించే అవకాశాలు అధికమని తేలింది. లద్దాఖ్‌లో తరచుగా కొండ చరియలు విరిగి పడుతుండడానికి టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలతే కారణమని తెలిపింది. ఈ పరిశోధన ఫలితాలు టెక్నోఫిజిక్స్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.

అస్సాం-మిజోరం సరిహద్దులో ఘర్షణ
అస్సాం, మిజోరం సరిహద్దులో అక్టోబర్ 18న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సరిహద్దులోని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. భద్రతా సిబ్బంది రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. అస్సాంలోని లైలాపూర్, మిజోరంలోని వెరైంగ్టే గ్రామ ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. సరిహద్దులో చెట్లు కొట్టే విషయంలో వీరి మధ్య వివాదం మొదలైందని స్థానికులు పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : లద్దాఖ్ ప్రాంతంలో భూకంపాల ముప్పు అధికం
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
ఎందుకు : భూగర్భంలో ఇండియా, ఆసియన్ ఫలకాలు కలిసే చోట, లద్దాఖ్ ప్రాంతంలో ఫాల్ట్‌లైన్ క్రియాశీలకంగా ఉన్నందున
Published date : 19 Oct 2020 05:35PM

Photo Stories