Skip to main content

లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్‌కు అశోచక్ర పురస్కారం

ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్ర ప్రభుత్వం జనవరి 24న అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీ 2004లో ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు.

2018, నవంబర్ 25న జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అశోకచక్ర పురస్కారం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ
ఎందుకు : అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు
Published date : 25 Jan 2019 04:16PM

Photo Stories