ఖతార్ ఎమిర్‌తో ఇరాన్ అధ్యక్షుడు భేటీ
Sakshi Education
ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భేటీ అయ్యారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జనవరి 13 జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్తతల గురించి ఇరువురు నేతలు చర్చించారు. అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే తాము కోరుకుంటున్నామని రౌహానీ ప్రకటించారు. అయితే, అగ్రరాజ్యంతో చర్చలు మాత్రం అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసిన తరువాతేనని స్పష్టం చేశారు. ‘ఉద్రిక్తతలు తగ్గేందుకు, చర్చలు జరిగేందుకు అంతా కృషి చేయాలి. అదొక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం’ అని ఖతార్ ఎమిర్ వ్యాఖ్యానించారు. ఖతార్ అమెరికాకు, ఇరాన్‌కు నమ్మకమైన మిత్రదేశం. ఈ ప్రాంతంలో అమెరికా అతి పెద్ద మిలటరీ బేస్ ఖతార్‌లోనే ఉంది.
అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా సైనికులున్న స్థావరం లక్ష్యంగా ఇరాన్ మళ్లీ దాడికి దిగింది. బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్ బలాద్ వైమానిక దళ స్థావరంపై జనవరి 12న 8 ‘కాట్యూషా’ తరహా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఇరాక్ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్ గాయపడ్డారు. అల్ బలాద్ ఇరాక్ ఎఫ్ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో భేటీ
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ
ఎక్కడ : టెహ్రాన్, ఇరాన్
ఎందుకు : ప్రాంతీయంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో
మాదిరి ప్రశ్నలు

1. క్రింది వాటిలో ఖతార్ రాజధాని, కరెన్సీ(వరుసగా) ఏవి?
1. శాన్ మారినో, ఖతారి దిర్హం
2. దోహా, ఖతారి రియాల్
3. సావో టోమ్, ఖతారి దినార్
4. రియాద్, ఖతారి డాలర్
1. శాన్ మారినో, ఖతారి దిర్హం
2. దోహా, ఖతారి రియాల్
3. సావో టోమ్, ఖతారి దినార్
4. రియాద్, ఖతారి డాలర్
- View Answer
- సమాధానం : 2
Published date : 14 Jan 2020 04:05PM