ఖేల్‌రత్న అవార్డుకు ఐదుగురి పేర్లు సిఫారసు
Sakshi Education
భారత క్రీడా అవార్డుల చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదుగురిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ కోసం సెలెక్షన్ కమిటీ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.
మేటి క్రికెటర్ రోహిత్ శర్మ (మహారాష్ట్ర), మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (హరియాణా), టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనికబత్రా (ఢిల్లీ), భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ (హరియాణా), 2016 రియోపారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం నెగ్గిన దివ్యాంగ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు (తమిళనాడు) పేర్లను 12 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీ ఖరారు చేసింది.
ఆగస్టు 17, 18 తేదీల్లో సమావేశమైన ఈ కమిటీ ‘ఖేల్‌రత్న’తోపాటు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకాక్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. సెలెక్షన్ కమిటీ పంపించిన అవార్డుల జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం కేంద్ర క్రీడా శాఖకు ఉంటుంది.

Published date : 20 Aug 2020 11:49AM