క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నిలిపివేత
Sakshi Education
రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ‘క్యాండిడేట్స్ చెస్ టోర్నీ’ని నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కడి వొర్కవిచ్ మార్చి 26న ప్రకటించారు.
కరోనా విజృంభణ కారణంగా రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో టోర్నీని నిలిపివేయక తప్పలేదని తెలిపారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడు ప్రపంచ చెస్ టోర్నమెంట్‌లో నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడతాడు.
ఈ టోర్నిలో భాగంగా ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్ వాచియెల్ (ఫ్రాన్స్), ఇయాన్ నెపొమ్‌నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్ నుంచి కొనసాగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నిలిపివేత
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)
ఎక్కడ : రష్యా
ఎందుకు : కరోనా విజృంభణ కారణంగా రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతోఈ టోర్నిలో భాగంగా ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్ వాచియెల్ (ఫ్రాన్స్), ఇయాన్ నెపొమ్‌నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్ నుంచి కొనసాగిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నిలిపివేత
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)
ఎక్కడ : రష్యా
Published date : 27 Mar 2020 06:47PM