కవి శివారెడ్డికి సరస్వతీ సమ్మాన్
Sakshi Education
గుంటూరుకి చెందిన ప్రముఖ కవి కె. శివారెడ్డికి ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్-2018 పుస్కారం లభించింది.
ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే...’ అనే కవితా సంపుటి గాను ఈ అవార్డు దక్కింది. 2016లో ఈ కవితా సంపుటి విడుదలైంది. ఒక తెలుగు రచనకు ఈ పురస్కారం లభించడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 22 భాషల్లో వెలువడే రచనల్లోంచి మంచి సాహితీ విలువలతో కూడిన రచనలకు కేకే బిర్లా ఫౌండేషన్ సరస్వతీ సమ్మాన్‌ను అందజేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరస్వతీ సమ్మాన్-2018 పుస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : కె. శివారెడ్డి
ఎందుకు : ‘పక్కకి ఒత్తిగిలితే...’ అనే కవితా సంపుటి రచనకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరస్వతీ సమ్మాన్-2018 పుస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : కె. శివారెడ్డి
ఎందుకు : ‘పక్కకి ఒత్తిగిలితే...’ అనే కవితా సంపుటి రచనకు
Published date : 12 Apr 2019 05:51PM