కువైట్‌లో అత్యవసర క్షమాభిక్ష అమలు
Sakshi Education
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది.
అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)పై ఇప్పటిదాకా చట్టపరమైన చర్యలు తీసుకున్న కువైట్... ఈసారి అత్యవసర క్షమాభిక్ష అమలు చేయడమే కాకుండా సొంత ఖర్చులతో వారిని స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులను వారి సొంత దేశాలు పంపేందుకు గల్ఫ్ దేశాలు క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) అమలు చేస్తుండటం తెలిసిందే. 2018 జనవరిలో దీర్ఘకాలిక ఆమ్నెస్టీని అమలు చేసిన కువైట్ ప్రభుత్వం... ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో అత్యవసర క్షమాభిక్షను తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో దేశానికి ఒక్కో టైమ్ షెడ్యూల్ ప్రకటించిన కువైట్.. భారత్‌కు సంబంధించిన కార్మికుల దరఖాస్తుల ప్రక్రియను ఏప్రిల్ 20 నుంచి మొదలుపెట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యవసర క్షమాభిక్ష అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : కువైట్ ప్రభుత్వం
ఎక్కడ : కువైట్
ఎందుకు : కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యవసర క్షమాభిక్ష అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : కువైట్ ప్రభుత్వం
ఎక్కడ : కువైట్
ఎందుకు : కరోనా విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశమైన కువైట్ వలస కార్మికుల భారాన్ని తగ్గించుకోవాలని
Published date : 16 Apr 2020 06:05PM