కశ్మీర్‌పై జోక్యాన్ని సహించం : భారత్
Sakshi Education
జమ్మూకశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది.
ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్‌లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో సెప్టెంబర్ 10న జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Published date : 11 Sep 2019 05:15PM