Skip to main content

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం

జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్‌సభ జూన్ 28న ఆమోదం తెలిపింది.
ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. కశ్మీర్ విషయమై లోక్‌సభలో జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం, రాజకీయ సమస్యలకు భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూయే కారణమని నిందించారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) 2019 బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జమ్మూ కశ్మీర్ రాష్ట్రపతి పాలన పొడిగించేందుకు ఆమోదం
ఎప్పుడు : జూన్ 28న
ఎవరు : లోక్‌సభ
Published date : 29 Jun 2019 05:58PM

Photo Stories