Skip to main content

క్షిపణి కేంద్రం ఏర్పాటుకు బీడీఎల్, ఎంబీడీఏ ఒప్పందం

మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లో ఓ క్షిపణి పరీక్ష, తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. స్వల్ప దూర లక్ష్యాలను ఛేదించగల, గాల్లోంచి గాల్లోకి ప్రయోగించగల క్షిపణి (ఏఎస్‌రామ్‌) పరీక్ష, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఎంబీడీఏలు తీర్మానించాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్యఆగస్టు 17న లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం ఈ పరీక్ష, తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పరికరాలను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని బీడీఎల్‌కుఎంబీడీఏబదలాయించనుంది.2022–23నాటికల్లా క్షిపణి తయారీ, పరీక్షలు మొదలుపెడతామని బీడీఎల్‌ తెలిపింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఎంబీడీఏతో ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు17
ఎవరు :భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)
ఎందుకు :భారత్‌లోఓ క్షిపణి పరీక్ష, తయారీ కేంద్రం ఏర్పాటు కోసం...

Published date : 18 Aug 2021 06:51PM

Photo Stories