కరోనాతో ఆకలికేకలు రెట్టింపు: ఐరాస
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య కోవిడ్–19 కారణంగా రెట్టింపు కానుందని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది.
158కోట్ల మంది విద్యార్థుల చదువులకు ఆటంకం
కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య రెట్టింపు
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్–19 కారణంగా
ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక నివేదికను సమర్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక రంగం అంతర్జాతీయంగా ఆకలికేకలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఈ నివేదికలో వెల్లడైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తోంటే, కోవిడ్ ప్రభావంతో 2020 యేడాదికి ఈ సంఖ్య మరో 13 కోట్లు పెరిగి, 26.5 కోట్లకు చేరుతుందని ఆ రిపోర్టు అంచనా వేసింది. 50 దేశాలకు చెందిన 2019 ఏడాది రిపోర్టులను 2020 ఏడాదితో పోల్చి చూస్తే ఆహార సంక్షోభం 12.3 కోట్లకు అంటే పది శాతం పెరిగింది.
158కోట్ల మంది విద్యార్థుల చదువులకు ఆటంకం
కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య రెట్టింపు
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : కోవిడ్–19 కారణంగా
Published date : 22 Apr 2020 06:35PM