Skip to main content

కరోనాపై 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ ఏర్పాటు

కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా నివారించాలని, కచ్చితమైన సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌ను 24 గంటల్లోగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Current Affairs

లాక్‌డౌన్‌ అనంతరం వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి ఇళ్లకు మరలడంపై దాఖలైన రెండు పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ నాగేశ్వరరావుల బెంచ్ మార్చి 31న‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘శిక్షణపొందిన కౌన్సెలర్లను రప్పించి షెల్టర్‌ హోమ్‌లలో ఉన్న వలస కార్మికుల్లో ఆందోళనను పోగొట్టాలి. పోలీసులకు బదులుగా వలంటీర్లకే షెల్టర్ల నిర్వహణ బాధ్యతలు చూడాలి. కార్మికులకు పరీక్షలు చేపట్టి, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలి‘ అని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : కరోనాపై 24 గంటల్లోగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలి
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : కరోనా వ్యాప్తిపై ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా
Published date : 02 Apr 2020 12:41PM

Photo Stories