Skip to main content

కరోనా వైరస్‌ వ్యాప్తిపై జీఓఎం స‌మావేశం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏప్రిల్ 9న కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది.
Current Affairs భౌతిక దూరం పాటించడం సహా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వ‌రులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది.


క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్‌ అధ్యక్షతన జీఓఎం స‌మావేశం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చ‌ర్చించేందుకు
Published date : 10 Apr 2020 06:20PM

Photo Stories