Skip to main content

కరోనా టీకా పంపిణీ కోసం భారత్‌ రూపొందించిన యాప్‌ పేరు?

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం భారత ప్రభుత్వం ‘‘కో–విన్‌(Co-Win)’’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
Current Affairs
టీకా వేయించుకునే వారు కో–విన్‌ యాప్‌ ద్వారా ముందుగా పేరు నమోదు చేయించుకోవచ్చు.. లేదా నేరుగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కేంద్రా(సీవీసీ)లకు వెళ్లి పేరు రిజిస్టర్‌ చేయించుకుని టీకా వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ ఫిబ్రవరి 27న తెలిపింది.

ఒక్క డోస్‌కు రూ. 250
దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైగా వయసున్న, 45 ఏళ్లకు పైగా వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఇందులో టీకా డోసు ధర రూ.150 కాగా, సర్వీసు చార్జీ రూ.100 ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా పొందవచ్చు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : కో–విన్‌(Co-Win) పేరుతో ప్రత్యేక యాప్‌ రూపకల్పన
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : కేంద్ర ఆరోగ్య శాఖ
ఎందుకు : దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం
Published date : 01 Mar 2021 06:12PM

Photo Stories