కరోనా నిరోధానికి డీఆర్‌డీవో కొత్త పరికరం
Sakshi Education
కరోనా వైరస్ కట్టడికి డీఆర్‌డీవో మరో పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
రోగుల నుంచి వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు.. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, చండీగఢ్‌లోని టీబీఆర్‌ఎల్‌లు సంయుక్తంగా ‘ఏరోసాల్ కంటెయిన్మెంట్ బాక్స్’ను రూపొందించింది. చికిత్స లేదా నమూనాల సేకరణ సమయాల్లో రోగి నోటి నుంచి వెలువడే తుంపర్లు ఏవీ వైద్య సిబ్బందికి తాకకుండా ఈ పరికరం అడ్డుగోడ మాదిరిగా పనిచేస్తుంది. రోగికి పరీక్షలు జరిపేందుకు వీలుగా ఇందులో రెండు రంధ్రాలను ఏర్పాటు చేశారు. అక్రిలిక్/పెర్స్‌పెక్స్ పదార్థంతో తయారైన ఈ బాక్స్ తేలికగానే ఉంటుంది. రెండు సైజుల్లో లభించే ఈ పరికరం లభిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏరోసాల్ కంటెయిన్మెంట్ బాక్స్ రూపకల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎందుకు : కరోనా వైరస్ కట్టడికి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏరోసాల్ కంటెయిన్మెంట్ బాక్స్ రూపకల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎందుకు : కరోనా వైరస్ కట్టడికి
Published date : 11 Apr 2020 06:29PM