కరోనా నిర్ధారణకు నూతన పరికరం అభివృద్ధి
Sakshi Education
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాధిని కేవలం యాభై నిమిషాల్లో నిర్ధారించేందుకు యునెటైడ్ కింగ్‌డమ్‌లోని శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు.
గొంతు నుంచి సేకరించే నమూనాల సాయంతో ఈ చిన్న పరికరం వ్యాధిని నిర్ధారిస్తుంది. ఈ యంత్రం సాయంతో ఏకకాలంలో 16 నమూనాలను పరీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాధిని నిర్ధారించేందుకు 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చిన్నసైజులో ఉండే.. అటూ ఇటూ సులువుగా మోసుకెళ్లగలిగే యంత్రాన్ని తయారు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా నిర్ధారణకు నూతన పరికరం అభివృద్ధి
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
ఎక్కడ : యునెటైడ్ కింగ్‌డమ్
Published date : 27 Mar 2020 06:53PM