Skip to main content

కరోనా చికిత్సకు ఐకో వెంట్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల కోసమే దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేటర్‌.. ‘ఐకో వెంట్‌’ పేరుతో మార్కెట్‌లోకి రానుంది.
Current Affairs

అందుబాటులో ఉన్న పరికరాలు, తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ వెంటిలేటర్‌ కరోనా బారినపడిన రోగులపై బాగా పనిచేస్తుందని దీని రూపకర్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏప్రిల్ 21న తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని, తమ ఐకో వెంట్‌ వెంటిలేటర్లు ఆ కొరతను తీర్చబోతున్నాయని చెప్పారు. ఐకో వెంట్‌ను కరోనా, న్యుమోనియా, ఏఆర్‌డీఎస్‌ (ఆక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిం డ్రోమ్‌) రోగుల కోసమే రూపొందించామన్నారు. ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్‌ను కచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి పంపి, బయటకు వదిలే క్రమంలో కచ్చితమైన ప్రెషర్‌ను ఇది అనుమతిస్తుందన్నారు.


చైనా వైద్యుల‌కు క‌రోనా టీకా


కరోనా వైరస్‌ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాను ఏడాది చివరిలోగా కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్యులకు అందించాలని చైనా యోచిస్తోంది. సాధారణ పద్ధతుల్లో తయారు చేస్తే 2020, ఏడాది చివరికి టీకా అందుబాటులోకి రాదని, అయితే ఈ మధ్యలో పరిస్థితి విషమిస్తే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి దీన్ని వాడతామని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డైరెక్టర్‌ గావ్ ఫూ తెలిపారు. చైనా అకాడమీ ఆఫ్‌ మిలటరీ సైన్సెస్‌ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిలిటరీ మెడిసిన్‌ ఓ అడినోవైరస్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. మార్చి నెలాఖరుకు తొలిదశ ప్రయోగాలు పూర్తి కాగా, ఏప్రిల్‌ 12న రెండో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఐకో వెంట్‌ వెంటిలేటర్‌ రూప‌క‌ల్పన‌
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఎందుకు : కరోనా చికిత్సకు
Published date : 22 Apr 2020 07:53PM

Photo Stories