కరోనా చికిత్స కోసం జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన ఔషధం?
Sakshi Education
కోవిడ్–19 చికిత్స కోసం జైడస్ క్యాడిలా సంస్థ... ‘‘విరాఫిన్ (పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా–2బి)’’ అనే ఔషధాన్ని తయారు చేసింది.
ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసినట్టు జైడస్ ఏప్రిల్ 23న వెల్లడించింది. కరోనా మధ్య స్థాయి లక్షణాలతో బాధపడేవారిలో విరాఫిన్ యాంటీ వైరల్ ఇంజెక్షన్ సమర్థవంతంగా పని చేస్తోందని పేర్కొంది. ఈ ఔషధం క్లినికల్ ప్రయోగాల్లో 99.15 శాతం మందికి ఏడు రోజుల్లోనే నెగెటివ్ ఫలితం వచ్చినట్టుగా వివరించింది. ప్రస్తుతం డీసీజీఐ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ వేణుగోపాల్ జీ సోమాని(వీజీ సోమాని) ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విరాఫిన్ (పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా–2బి) అనే ఔషధం అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : జైడస్ క్యాడిలా సంస్థ
ఎందుకు : కోవిడ్–19 చికిత్స కోసం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : విరాఫిన్ (పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ ఆల్ఫా–2బి) అనే ఔషధం అభివృద్ధి
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : జైడస్ క్యాడిలా సంస్థ
ఎందుకు : కోవిడ్–19 చికిత్స కోసం...
Published date : 24 Apr 2021 06:27PM