Skip to main content

కర్ణాటకలో మంకీ ఫివర్ విజృంభణ

కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్, బర్డ్ ఫ్లూ కేసులు బయటపడగా తాజాగా మంకీ ఫివర్ (కోతి జ్వరం) కోరలు చాస్తోంది.
Current Affairsశివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా తణికల్‌లో ముగ్గురికి మంకీ ఫివర్ సోకింది. మరో చిన్నారి కూడా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆరళాపుర గ్రామ పంచాయతీ పరిధిలో 15 రోజుల్లో 9 కోతులు ఈ జబ్బుతో చనిపోయాయిప. 2020, ఏడాది ఆరంభం నుంచి పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి.

మంకీ ఫివర్ లక్షణాలు
ఇది కోతుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్ కారక జ్వరం. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ముక్కు, గొంతు, నోటి చిగుళ్ల నుంచి రక్తస్రావం దీని లక్షణాలు.

చైనాను మించిన ఇటలీ
కరోనా వైరస్ మరణాల్లో ఇటలీ చైనాను మించిపోయింది. ఇటలీలో తాజాగా మరో 427 మంది చనిపోవడంతో ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య 3,405 కు చేరుకుంది. చైనాలో మార్చి 19 నాటికి మరణాల సంఖ్య 3,245కు చేరుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మంకీ ఫివర్ విజృంభణ
ఎప్పుడు : మార్చి 19
ఎందుకు : శివమొగ్గ జిల్లా, కర్ణాటక
Published date : 20 Mar 2020 06:01PM

Photo Stories