క్రికెటర్ రసిక్ సలామ్‌పై రెండేళ్ల సస్పెన్షన్
Sakshi Education
నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు జమ్మూ కశ్మీర్ యువ పేసర్ రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
జూలై నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న జాతీయ అండర్-19 జట్టు నుంచి సైతం తప్పించింది. అతడి స్థానంలో బెంగాల్‌కు చెందిన ప్రభాత్ మౌర్యను ఎంపిక చేసింది. రసిక్... ఐపీఎల్-12 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కు ఒక మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రతిభావంతుడైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు అనవసర వివాదంతో కెరీర్‌కు చేటు తెచ్చుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
ఎవరు: రసిక్ సలామ్
ఎందుకు: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు
క్విక్ రివ్యూ:
ఏమిటి: రసిక్ సలామ్‌ను బీసీసీఐ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది.
ఎవరు: రసిక్ సలామ్
ఎందుకు: నకిలీ జనన ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు
Published date : 20 Jun 2019 05:57PM