Skip to main content

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్?

ఐసీసీ టి20 ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Current Affairs
39 ఏళ్ల శామ్యూల్స్ ఈ మేరకు నవంబర్ 4న తన నిర్ణయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్‌లో శామ్యూల్స్ చివరిసారి వెస్టిండీస్ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు.

71 టెస్టులు, 207 వన్డేలు...
2000లో క్రికెట్‌లో అడుగుపెట్టిన శామ్యూల్స్ ఓవరాల్‌గా తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు) చేశాడు. 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీసుకున్నాడు.

రెండేళ్లపాటు నిషేధం...
2008లో బుకీల నుంచి శామ్యూల్స్ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్
Published date : 05 Nov 2020 05:52PM

Photo Stories