Skip to main content

క్రికెట్‌ వీడ్కోలు పలికిన యూసుఫ్, వినయ్‌

భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్‌లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఫిబ్రవరి 26న ఆటకు వీడ్కోలు పలికారు.
Current Affairs
38 ఏళ్ల గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ తన రిటైర్మెంట్‌ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్‌ బౌలర్‌ వినయ్‌ కుమార్‌ కూడా వీడ్కోలు పలికాడు.

యూసుఫ్‌ పఠాన్‌...
1982, నవంబర్‌ 17న గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన యూసుఫ్‌... 2007 టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (పాకిస్తాన్‌పై)తో అరంగేట్రం చేశాడు. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్‌ 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్‌ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. 57 వన్డేల్లో 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో తనదైన ప్రదర్శనతో గుర్తింపు పొందాడు.

వినయ్‌ కుమార్‌...
1984, ఫిబ్రవరి 12న కర్ణాటకలోని దావణగెరెలో వినయ్‌ జన్మించాడు. ఈ పేస్‌ బౌలర్‌ 139 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్‌ గోయల్‌ (637), వెంకట్రాఘవన్‌ (530), సునీల్‌ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్‌ ఉండగా... పేస్‌ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. కర్ణాటకతో పాటు పుదుచ్చేరి తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్‌లోనూ తన ప్రతిభను చాటాడు. భారత్‌ తరపున ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్‌ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి : క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఆటగాళ్లు?
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : యూసుఫ్‌ పఠాన్, వినయ్‌ కుమార్‌
Published date : 27 Feb 2021 05:55PM

Photo Stories