Skip to main content

కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది?

తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్లను పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్ట సిద్ధం చేసింది.
Current Affairsట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయిందని మార్చి 21న రైల్వే శాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్‌ అమర్చారు.

నిరుపేదలుగా మారిన 3.2 కోట్ల మంది
కరోనా సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక కష్టాలు భారత్‌లో మధ్య తరగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. దాదాపుగా 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువకు పడిపోయారని నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం... 2020 ఏడాది కరోనా విజృంభించిన సమయంలో రోజుకి రూ. 724 నుంచి రూ.1449 వరకు సంపాదించే వారిలో 3.2 కోట్ల మంది తమ సంపాదనని కోల్పోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు.
Published date : 23 Mar 2021 11:40AM

Photo Stories