Skip to main content

కొవాగ్జిన్ అత్యంత సురక్షితమైనది: లాన్సెట్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘‘కొవాగ్జిన్’’ అత్యంత సురక్షితమైనదని, ఆ వ్యాక్సిన్ ద్వారా తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని యూకేలో ప్రఖ్యాతి చెందిన మెడికల్ జర్నల్ లాన్సెట్ మార్చి 9న ఒక నివేదికలో వెల్లడించింది.
Current Affairs

అయితే ఆ వ్యాక్సిన్‌ ఎంత సమర్థంగా పని చేస్తుందో మూడో దశ ప్రయోగాలు పూర్తయ్యాక చెప్పగలమని పేర్కొంది. కొవాగ్జిన్‌ 81శాతం సామర్థ్యంతో పని చేస్తోందని భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

  • సీసీఎంబీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
  • ప్రస్తుతం సీసీఎంబీ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఉన్నారు.
  • భారత్‌ బయోటెక్‌(ప్రై వేటు కంపెనీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
  • ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌–ఎండీగా డాక్టర్‌ కృష్ణా ఎల్లా ఉన్నారు.
  • భారత్‌ బయోటెక్‌ స్థాపకులు : డాక్టర్‌ కృష్ణా ఎల్లా
Published date : 10 Mar 2021 06:13PM

Photo Stories