Skip to main content

కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు

రక్షణ శాఖలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సీడీఎస్‌గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ దీనికి నేతృత్వం వహించనున్నారని ప్రభుత్వం డిసెంబర్ 31 తెలిపింది.
Current Affairs ఇందుకు సంబంధించి 1961 నాటి భారత ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చేపట్టేందుకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారని పేర్కొంది. త్రివిధ దళాలకు సంబంధించిన కొనుగోళ్లను, మిలటరీ కమాండ్‌ల పునర్వ్యవస్థీకరణ, అన్ని కమాండ్‌లను సమన్వయ పరుస్తూ వనరులను గరిష్టంగా వినియోగపడేలా చూడటం డీఎంఏ బాధ్యత.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి
 : కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు
 ఎప్పుడు : డిసెంబర్ 31
 ఎవరు
 : కేంద్రప్రభుత్వం
 ఎందుకు : త్రివిధ దళాలకు సంబంధించిన కొనుగోళ్లను, మిలటరీ కమాండ్‌ల పునర్వ్యవస్థీకరణ కోసం

మాదిరి ప్రశ్నలు
1. రక్షణ శాఖలో కొత్తగా ఏర్పాటైన సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)కు ఎవరు నేతృత్వం వహిస్తారు?
 1. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే 2. అడ్మిరల్ కరంబీర్ సింగ్
 3. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కే భదౌరియా 4. జనరల్ బిపిన్ రావత్
Published date : 01 Jan 2020 07:10PM

Photo Stories