Skip to main content

కొత్తగా 24 సబ్‌మెరైన్ల నిర్మాణం

నౌకాదళ సామర్ధ్యాన్ని మరింత పెంచే దిశగా మరో 24 జలాంతర్గాములను నిర్మించనున్నట్లు భారతీయ నౌకాదళం డిసెంబర్ 29ప వెల్లడించింది.
Current Affairsఅందులో 6 జలాంతర్గాములు అణ్వస్త్ర సామర్ధ్యమున్నవని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన ఒక నివేదికలో వివరించింది. ప్రస్తుతం నౌకాదళం వద్ద 15 సాధారణ జలాంతర్గాములు, రెండు అణ్వస్త్ర సామర్ధ్యమున్న జలాంతర్గాములు ఉన్నాయని తెలిపింది. 15 సాధారణ జలాంతర్గాముల్లో అనేకం 25 ఏళ్లు పైబడినవేనని వెల్లడించింది. హిందూ మహా సముద్రంలో చైనా నేవీ కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు-1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ డిసెంబర్ 29న నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు.
Published date : 30 Dec 2019 06:10PM

Photo Stories