కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వ్యక్తి?
Sakshi Education
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ నియమితులయ్యారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి(జార్ఖండ్ క్యాడర్) అయిన రాజీవ్ కుమార్ ఐదేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగి, 2025లో రిటైర్ అవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఈయన నేతృత్వంలో జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు పదవిలో ఉండాల్సి ఉండగా, 2025 ఫిబ్రవరిలో 65 ఏళ్లు నిండడంతో ఈయన ఒక ఏడాది ముందుగానే రిటైర్ కానున్నారు.
చదవండి: ఏడీబీ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లవాసా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గాబాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్
Published date : 02 Sep 2020 05:07PM