కోవిడ్ టీకాలపై మ్యూనిచ్ యూనివర్సిటీ నివేదిక
Sakshi Education
సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది.
![Current Affairs](/sites/default/files/images/2021/07/05/BloodClots.jpg)
తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్ యూనివర్సిటీ(జర్మనీ) పరిశోధనలో తేలింది.
ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ సహా పలు టీకాల విషయంలో రక్తంలో గడ్డల(పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపెనిక్ సిండ్రోమ్– టీటీఎస్ లేదా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని మ్యూనిచ్ వర్సిటీ తాజా నివేదిక తెలిపింది.

Published date : 05 Jul 2021 05:29PM