కోవిడ్ కట్టడికి స్వచ్ఛంద యుద్ధం: యూనిసెఫ్
Sakshi Education
కోవిడ్-19 నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధ వీరులు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్ సొసైటీలు పిలుపునిచ్చాయి.
ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆ తర్వాతి స్థాయిల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇతరులకు దీనిపై అవగాహన కల్పించాలని కోరాయి. ఈ మేరకు మార్చి 19న 13 పేజీల బులెటిన్‌ను విడుదల చేశాయి. శుభ్రత, అవగాహన, విసృ్తత ప్రచారం, స్వచ్ఛంద సేవ ద్వారా ప్రపంచాన్ని కరోనా గండం నుంచి బయటపడేసే బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ కట్టడికి విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్ సొసైటీ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ కట్టడికి విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్ సొసైటీ
ఎక్కడ : ప్రపంచ వ్యాప్తంగా
Published date : 20 Mar 2020 05:48PM