కోవిడ్ చికిత్సకు నూతన పరికరం ఆవిష్కరణ
Sakshi Education
ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడిన వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చకుండా వారి ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన పరిశోధకులు ఓ కొత్త పరికరాన్ని రూపొందించారు.
’కంటిన్యుయస్ పాసిటీవ్ ఏర్‌వే ప్రెషర్ (సీపీఏపీ)’ గా నామకరణం చేసిన ఈ పరికరం పని విధానాన్ని ప్రస్తుతం లండన్ ఉత్తరాది ఆస్పత్రుల్లో పరీక్షించి చూస్తున్నారు. కరోనా బాధితుల ఊపిరితిత్తులను ప్రభావితం చేయడం కోసం పేషంట్ ధరించిన మాస్క్‌లోకి ఈ పరికరం ఆక్సిజన్‌ను గాలిని పంపిస్తుందని వర్సిటీ పరిశోధకులు తెలిపారు. మెర్సిడెస్ ఫార్ములా వన్ ఇంజనీర్ల సహకారంతో సీసీఏపీని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కంటిన్యుయస్ పాసిటీవ్ ఏర్‌వే ప్రెషర్ (సీపీఏపీ) పేరుతో నూతన పరికరం ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన పరిశోధకులు
ఎందుకు : కోవిడ్-19 బారిన పడిన వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చకుండా వారి ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించేందుకు
Published date : 31 Mar 2020 06:55PM