Skip to main content

కోటక్ బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ కొనసాగింపు

ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగా ఉదయ్ కోటక్ కొనసాగనున్నారు.
Current Affairs
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. దీంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీ పదవిలో మరో మూడేళ్ల పాటు ఉదయ్ కోటక్ కొనసాగనున్నారు. బ్యాంక్ పార్ట్‌టైమ్ చైర్మన్‌గా ప్రకాశ్ అప్టే నియామకానికి కూడా ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.

అమెరికాలో ఫైజర్ టీకా వ్యాక్సినేషన్...
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం డిసెంబర్ 14న ప్రారంభమైంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2 (BNT162b2)’’ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ లో ఉన్న లాంగ్ ఐలాండ్ జ్యుయిష్ మెడికల్ సెంటర్ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎమ్‌డీగాకొనసాగింపు
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఉదయ్ కోటక్
ఎందుకు : ఉదయ్ కోటక్ కొనసాగింపునకు ఆర్‌బీఐ ఆమోదం తెలపడంతో
Published date : 15 Dec 2020 06:05PM

Photo Stories