కోస్టల్ సర్క్యూట్‌లో 75 శాతం పనులు పూర్తి
Sakshi Education
నెల్లూరు జిల్లాలో కోస్టల్ సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 75 శాతం అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద 2015-16లో రూ.59.70 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కింద నెల్లూరు, పులికాట్ సరస్సు, ఉబ్లమడుగు జలపాతం, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం, కొత్త కోడూరు బీచ్, మైపాడు బీచ్, రామతీర్థం, ఇస్కపల్లిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోస్టల్ సర్క్యూట్‌లో 75 శాతం పనులు పూర్తి
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఎక్కడ : నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదే శ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోస్టల్ సర్క్యూట్‌లో 75 శాతం పనులు పూర్తి
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్
ఎక్కడ : నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదే శ్
Published date : 26 Jun 2019 06:16PM