కళ్యాణరామన్‌కు ప్రతిష్టాత్మక ఐఏఏ అవార్డు
Sakshi Education
కొచ్చి: కళ్యాణ్ జ్యుయలర్స్ వ్యవస్థాపక సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్‌కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వర్‌టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు లభించింది.
ఇక్కడ జరుగుతున్న 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌లో.. సంస్థకు జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఈ అవార్డును అందజేసింది. కళ్యాణ్ జ్యుయలర్స్‌ను ఆకర్షణీయ బ్రాండ్‌గా రూపుదిద్దినందుకు ఈ అవార్డును అందజేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా కళ్యాణరామన్ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డ్ కస్టమర్లకు అంకితం. కేరళలో ఒక్క స్టోర్‌తో మొదలైన మా ప్రయాణం.. నేడు ప్రపంచస్థాయికి చేరుకోవడానికి కారణం కస్టమర్లే’ అని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కళ్యాణ్ జ్యుయలర్స్ వ్యవస్థాపక సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్‌కుఐఏఏ అవార్డు
ఎక్కడ : కొచ్చి
ఎవరు : టి.ఎస్.కళ్యాణరామన్
ఎందుకు : కళ్యాణ్ జ్యుయలర్స్‌ను ఆకర్షణీయ బ్రాండ్‌గా రూపుదిద్దినందుకు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కళ్యాణ్ జ్యుయలర్స్ వ్యవస్థాపక సీఎండీ టి.ఎస్.కళ్యాణరామన్‌కుఐఏఏ అవార్డు
ఎక్కడ : కొచ్చి
ఎవరు : టి.ఎస్.కళ్యాణరామన్
ఎందుకు : కళ్యాణ్ జ్యుయలర్స్‌ను ఆకర్షణీయ బ్రాండ్‌గా రూపుదిద్దినందుకు.
Published date : 21 Feb 2019 06:03PM