క్లైవ్ లాయిడ్‌కు నైట్‌హుడ్ పురస్కారం
Sakshi Education
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌ను బ్రిటీష్ అత్యుత్తమ పురస్కారం ‘నైట్‌హుడ్’వరించింది.
లాయిడ్‌కు ఈ అవార్డును అందజేయనున్నట్లు ‘న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్’లో బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ‘సర్’బిరుదును సొంతం చేసుకున్న విండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, ఎవర్టన్ వీక్స్, వివియన్ రిచర్డ్స్ సరసన క్లైవ్ లాయిడ్ నిలవబోతున్నాడు. క్లైవ్ హ్యూబర్ట్ లాయిడ్ 1944లో గయానాలో జన్మించాడు. 22 ఏళ్ల వయస్సులో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 110 టెస్టుల్లో 46కు పైగా సగటుతో 7,515 పరుగులు చేశాడు. అలాగే 87 వన్డే మాచ్‌ల్లో 1,977 పరుగులు సాధించాడు. 1975, 1979లో వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించాడు. 1985లో చివరి మ్యాచ్ ఆడాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌కు నైట్‌హుడ్ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌కు నైట్‌హుడ్ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం
Published date : 30 Dec 2019 06:14PM