కలామ్ జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రకృతి వైద్యుడు?
Sakshi Education
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ప్రకృతి వైద్యుడు కె.వై.రామచందర్‌రావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
ఢిల్లీలోని క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్య ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2020, నవంబర్ 15వ తేదీన ఢిల్లీలో కేరళ గవర్నర్చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. డాక్టర్ రామచందర్‌రావు సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆయనకు అవార్డుతోపాటు ‘ఎ లివింగ్ చరక మహర్షి’ అనే బిరుదు కూడా ఇవ్వనున్నారు.
చదవండి: ప్రస్తుతం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
నేలకొండపల్లిలో 22 ఏళ్ల క్రితం సిద్ధార్థ యోగా విద్యాలయం ఏర్పాటు చేసిన డాక్టర్ రామచందర్‌రావు, ఆయన భార్య డాక్టర్ ఎన్.జి.పద్మ.. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైద్యులుగా పేరొందడంతో తెలుగు రాష్ట్రాలే కాకుండా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రకృతి వైద్యుడు కె.వై.రామచందర్‌రావు
ఎందుకు : వైద్య రంగంలో చేసిన విశేష కృషికి గాను

Published date : 13 Nov 2020 05:52PM