కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
Sakshi Education
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ భారత్‌లో తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అక్టోబర్ 10న ప్రారంభించింది.
హరియాణలోని గురుగ్రామ్‌లో ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘ఈ సెంటర్ పేరులోని మొదటి పదం బీటింగ్ ఆఫ్ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కియా మోటార్స్
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : కియా మోటార్స్
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ
Published date : 11 Oct 2019 04:46PM