Skip to main content

కిర్లోస్కర్ జీవిత కథ యాంత్రిక్ కి యాత్ర ఆవిష్కరణ

కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Current Affairsన్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో మోదీ వీటిని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని స్పష్టం చేశారు.

ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో జనవరి 6న జరిగిన ఈ సమావేశంలో ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్, టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్‌అండ్‌టీ అధినేత ఏఎం నాయక్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కిర్లోస్కర్ జీవిత కథ యాంత్రిక్ కి యాత్ర ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ

మాదిరి ప్రశ్నలు
Published date : 07 Jan 2020 05:30PM

Photo Stories