కికెటర్ శ్రీశాంత్‌కు జీవితకాలం నిషేధం వద్దు
Sakshi Education
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం మార్చి 15న తోసిపుచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను బీసీసీఐ పునఃసమీక్షించాలని పేర్కొంది. ఈ మేరకు మార్చి 15న శ్రీశాంత్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని జస్టిస్ అశోక్‌భూషణ్, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం బీసీసీఐ క్రమశిక్షణ కమిటీని ఆదేశించింది. శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. బీసీసీఐ నిషేధం ఎత్తేస్తే శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆయన కోర్టుకు వివరించారు.
‘క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉంది’
తీర్పు అనంతరం శ్రీశాంత్ మీడియాతో మాట్లాడాడు. తనపై నిషేధం తగ్గించాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై అతను సంతోషం వ్యక్తంచేశాడు. ఈ ఆరేళ్లూ నా జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోయాయి. నేను నిర్దోషినని తెలిసినా బీసీసీఐ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నాపై నిషేధం ఎత్తేస్తే మరింత సంతోషిస్తా. అదే జరిగితే మళ్లీ క్రికెట్‌లో సత్తా చాటుతా. వయసు అసలు సమస్యే కాదు. ఫిట్‌నెస్ ఉన్నంతవరకు క్రికెట్ ఆడొచ్చు. 42 ఏళ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్‌స్లామ్ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకై నా మంచి క్రికెట్ ఆడలేనా?’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : క్రికెటర్ శ్రీశాంత్‌కు జీవితకాలం నిషేధం నుంచి ఊరట
ఎవరు: క్రికెటర్ శ్రీశాంత్
ఎప్పుడు : మార్చి 15
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : స్పాట్ ఫిక్సింగ్ కేసులో

Published date : 16 Mar 2019 06:25PM