Skip to main content

కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
తాజాగా జరిగిన కెనడా సాధారణ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్‌కుగానూ 157 డిస్ట్రిక్ట్స్‌లో విజయం సాధించింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డిస్ట్రిక్ట్స్‌లో గెలిచింది. ఇండియన్ కెనడియన్ అయిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ(ఎన్‌డీపీ) 24 సీట్లు, బ్లాక్ క్యూబెకాయిస్ 32, గ్రీన్ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి.

2.74 కోట్ల ఓటర్లును కెనడాలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 170 కాగా, అధికార పార్టీ 157 దగ్గర నిలిచిపోయింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 24 సీట్లు గెలుచుకున్న ఎన్‌డీపీ ‘కింగ్ మేకర్’గా అవతరించింది. కెనడాలోని ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నేత జగ్మీత్ సింగ్‌నే కావడం విశేషం. జగ్మీత్ సింగ్ గతంలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేశారు.
Published date : 23 Oct 2019 06:02PM

Photo Stories