కెంటో మొమోటాకు చైనా ఓపెన్ టైటిల్
Sakshi Education
జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
చైనాలోని ఫుజౌలో నవంబర్ 10న జరిగిన ఫైనల్లో మొమోటా 21-15, 17-21, 21-18తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ గెలిచిన షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీ చోంగ్ వీ (మలేసియా-2010లో 9 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును మొమోటా బద్దలు కొట్టాడు. 2019 ఏడాది మరో టైటిల్ సాధిస్తే మొమోటా ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా-మహిళల డబుల్స్‌లో 10 టైటిల్స్; 2011లో) ద్వయం పేరిట ఉన్న రికార్డును మొమోటా సమం చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కెంటో మొమోటా
ఎక్కడ : ఫుజౌ, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కెంటో మొమోటా
ఎక్కడ : ఫుజౌ, చైనా
Published date : 11 Nov 2019 05:59PM