కేంద్రంలో ఏర్పాటు కానున్న నూతన మంత్రిత్వ శాఖ?
Sakshi Education
దేశంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను నూతనంగా ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
సహకార్ సే సమృద్ధి భావనను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ శాఖకు ప్రత్యేక లీగల్, పాలసీ విధానాలను రూపొందిస్తారు. నిజమైన ప్రజా ఉద్యమంగా సహకారోద్యమాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. సహకార సంఘాలు సులభంగా వ్యాపారాలు నిర్వహించుకునే వీలు కల్పించడం, మల్టి స్టేట్ కోఆపరేటివ్స్‌ను ఏర్పాటు చేయడంపై కొత్త శాఖ దృష్టి సారిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
Published date : 07 Jul 2021 05:30PM