Skip to main content

కేంద్రమంత్రి సావంత్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ గణపత్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 12న ఆమోదించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు సావంత్ రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో భారీ పరిశ్రమల శాఖను కేంద్ర పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో సావంత్ నవంబర్ 11న రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

(చదవంది : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా)

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ గణపత్ సావంత్ రాజీనామాకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 12 Nov 2019 05:43PM

Photo Stories